కనిగిరి: ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర టిడిపి ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి సందాని అన్నారు. కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు గురువారం టీడీపీ ముస్లిం మైనారిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సందాని మాట్లాడుతూ... టిడిపి అధికారం చేపట్టాక రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. కనిగిరి నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కూడా ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. టిడిపికి ముస్లిం మైనారిటీలు అండగా నిలవాలని కోరారు.