సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు రూ 21,17,909 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. ఆపదలో ఉన్న వారికి పేదవారికి అభయ హస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు.