హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు కండక్టర్ ఆదివారం గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద గుండెపోటుకు గురయ్యారు. సమాచారం అందుకున్న గన్నేరువరం పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు వెంకటేష్, మురళి వెంటనే స్పందించి కండక్టర్ కు సీపీఆర్ చేశారు. ఐదు నిమిషాల్లోనే కండక్టర్ కోలుకుని లేచి కూర్చున్నారు. పోలీసుల సత్వర స్పందనతో ప్రాణాలు కాపాడుకున్న కండక్టర్ ను బస్సులోని ప్రయాణికులు అభినందించారు. దీంతో కరీంనగర్ వచ్చిన బస్సు కండక్టర్ ను ఉదయం నగరం లోని ఓ ఆసుపత్రికి తరలించారు