నర్సాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం రసాభాసగా జరిగింది. అజెండా మొదలు పెట్టకుండానే కౌన్సిలర్ విప్ బొంతు రాజశేఖర్ కమీషనర్ తీరుపై మండిపడ్డారు. మీటింగ్ కు ఎందుకు వస్తున్నాము మాకే తెలియడం లేదని కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానం చెప్పడం లేదని నరసాపురం మున్సిపాలిటీ అధోగతి పాలు అయిందని అభివృద్ధి కుంటి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్స్ మరియు చైర్మన్ వెంకటరమణి సమావేశం నుండి బాయ్ కట్ చేశారు. మున్సిపల్ ఆఫీసు ముందు బైఠాయించి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కమిషనర్ పై నినాదాలు చేశారు.