మంత్రాలయం: మండలం కాచాపురం, తుంగభద్ర గ్రామాలలో ఉన్న ఎరువుల దుకాణాలలో కర్నూల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి గణేశ్, విజిలెన్స్ అధికారులు వెంకటప్రసాద్, వెంకటరమణ ఆధ్వర్యంలో దుకాణాలలోని రికార్డులు, ఎరువుల బస్తాలను పరిశీలించారు. దుకాణాలలోని సరైన రికార్డులు లేని 700 బస్తాల ఎరువులను సీజ్ చేశామని వారు తెలిపారు. మంత్రాలయం సీఐ రామానుజులు, మాధవరం ఎస్సై విజయ్ కుమార్ ఉన్నారు.