తాడిపత్రిలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పట్టణ సీఐ సాయి ప్రసాద్ మండపాల నిర్వాహకులకు సూచించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుడి పూజించి విఘ్నాలు తొలగేలా చేయాలన్నారు. ఏలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు.