బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం మధ్యాహ్నం వరకు కురుస్తున్న వర్షాల ధాటికి ధర్మవరం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. ధర్మవరం మండలంలో 72.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.