విశాఖ ఉమ్మడి జిల్లాలోని చోడవరం నుండి నర్సీపట్నం, వడ్డాది నుండి పాడేరు వరకు ఉన్న రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే ఈ రహదారుల నిర్వహణలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా బుధవారం రావికమతం వద్ద రోడ్డుపై మొక్కలు నాటి నిరసన తెలిపారు. విజయరామరాజుపేట, వడ్డాది మధ్య బ్రిడ్జిలు కూలిపోవడంతో రవాణా స్తంభించిపోయిందని, పాలకులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం ప్రతినిధి గోవిందరావు డిమాండ్ చేశారు.