సంగారెడ్డి జిల్లా హత్నూర రైతు వేదికలు శనివారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల తోపులాటతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శనివారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ నాయకులు చిత్రపటాన్ని తీసుకురావడంతో బిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరుపాటిల నాయకులను బయటకు పంపారు. అనంతరం ఎమ్మెల్యే సునీత రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.