ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ఆదివారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించి, రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు, మీ పట్ల మర్యాదగా వ్యవహరిస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, రక్త పరీక్షలు ఇక్కడే చేస్తున్నారా అని పలు ప్రశ్నలు వేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారు ఆసుపత్రి సేవలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.