రాష్ట్రంలో యూరియా అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండంటూ కొందరు మంత్రులు చెబుతున్నారని అన్నారు. ఓజీ టిక్కెట్లు కొంటేనే రైతులకు యూరియా ఇస్తారా అంటూ శివకుమార్ ప్రశ్నించారు. తెనాలిలో జరిగిన రైతు పోరులో ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. మంగళవారం తెనాలి ఆర్డిఓకి వైసీపీ నేతలు వినతి పత్రాన అందజేశారు.