గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం నిడుబ్రోలు వైపుకు వెళుతున్న ట్రాక్టర్ను పొన్నూరు వస్తున్న లారీ బ్రిడ్జిపై ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రక్కు, ఇంజన్ రెండు భాగాలుగా విడిపోయాయి. దీంతో ఇక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాద సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.