నల్గొండ జిల్లా, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాదారుల ఆగడాలు మితిమీరి పోయాయి. శనివారం సాయంత్రం స్థానికులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గుట్ట ప్రాంతంలో గల స.నెం.59 లో 13 ఎకరాల 37 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రెండు ఎకరాల భూమి ఆక్రమణకు భూకబ్జాదారులు యత్నించారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు. ఆక్రమణకు యత్నించింది నిజమేనని తేల్చారు. భూకబ్జాదారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కాగా ఇదంతా అధికార పార్టీకి చెందిన వారి పనేనని పలువురు స్థానికులు అంటున్నారు.