మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని నేషనల్ హైవే బ్రిడ్జి పై నుండి గురువారం సాయంత్రం కన్నెపెళ్లికి చెందిన దామోదర్ అనే వ్యక్తి దూకేందుకు ప్రయత్నించారు. పోలీసుల రాకను గమనించి బ్రిడ్జిపై నుండి సదరు వ్యక్తి, దూకడంతో నస్పూర్ ఎస్సై ఉపేందర్ చాకచక్యంగా వ్యవహరించి బ్రిడ్జి కింద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి వ్యక్తిని రక్షించారు.