జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం రాష్ట్ర రహదారిపై నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాదచారి స్తంభంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో అతను దూరంగా ఎగిరి పడ్డాడు.దీంతో అతని తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని,తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.