Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
కందుకూరులోని విప్పగుంట రోడ్డులో రంపపు మిల్లులో పని చేసే కార్మికుడు బుదవారం రాత్రి ఆత్మహత్య కు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన టంకేశ్వర్ (24) కొంతకాలంగా మిల్లులో కార్మికుడిగా పని చేశాడని తెలిసింది. జనవరిలో ఊరు వదిలి వెళ్లిన అతను మళ్లీ సోమవారం కందుకూరు వచ్చాడని తోటి కార్మికులు చెప్పారు. ఎవరూ లేని టైంలో రూములో ఉరి వేసుకున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.