జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేస్తున్న సేవలను గుర్తించి యువకులు గ్రామస్థాయిలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుల్లా బాబి అధ్యక్షతన దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెంటపాడు గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా కండువా వేసుకుని జనసేన పార్టీలోకి 50 మంది కార్యకర్తలు చేరారు.