జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల మరియు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్ తనిఖీ సమయంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, మంచం, దుప్పట్లు, స్నానాల గదులు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.