గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలోని కొందరు నివాసితులకు చెందిన గృహాలకు వెళ్లే దారిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ, కాలనీ మహిళలు సోమవారం ప్రత్తిపాడు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ ఆవేదన పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ప్రత్తిపాడు తహసిల్దార్ సంఘటన స్థలాన్ని సర్వే చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నిరసన తెలియజేస్తున్న మహిళలతో ఎస్సై నరహరి మాట్లాడి అనంతరం తాహసిల్దార్ తో మాట్లాడించారు.