ఎమ్మిగనూరు : గంగవరంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట ..నందవరం మండలం గంగవరంలో ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పర్యటించారు. ఆయనకు గ్రామ వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన సీనియర్ నేత ప్రహలాద రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివన్న, గడ్డం నారాయణరెడ్డి పాల్గొన్నారు.