అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని టిడిపి కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ వైసీపీ ఉనికి కోసం ఆరాట పడుతుందని అన్నారు. వైసిపి పాలనలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. గత పాలనలో టమాటా రైతులకు ఆదుకుంటామని రైతులను మోసం చేశారన్నారు. రైతు సేవా కేంద్రాలలో ప్రతి రైతుకు యూరియా బయోమెట్రిక్ ద్వారా సరఫరా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.