వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని డిసిసి బ్యాంకులో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు రైతులు ఆందోళన చేపట్టారు తమ పేరిట చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రుణాలు తీసుకున్నాడని తాను డబ్బులు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు తమకు నోటీసులు పంపారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పారు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని బ్యాంక్ అధికారులు అన్నారు