పీఎం నవోదయ విద్యాలయాల ప్రాంతీయ స్థాయి కళా ఉత్సవాలకు ఒంగోలు వేదికయింది. రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 165 మంది బాలబాలికలు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.విద్యార్థుల మానసిక వికాసానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని నవోదయ విద్యాసమతి అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి చెప్పారు. నృత్య, గాన,శిల్ప,చిత్ర,కళా విన్యాసాలలో ఈ పోటీలు బుధవారం కూడా కొనసాగుతాయి.