నల్గొండ పట్టణంలోని, బ్రహ్మంగారి గుట్ట పైన శివ సమేత శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు ఆదివారం సాయంత్రం భక్తులకు శాంకరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. దుర్గాదేవి నవరాత్రులు రాబోతున్న సందర్భంగా పలువురు భక్తులు భవాని అమ్మవారి మాలధారణ చేశారు. శాంకరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.