రాచకొండ సీపీ సుధీర్ బాబు గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సరూర్ నగర్ కట్టను సందర్శించారు. ఇప్పటివరకు 3 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యా యని, మరో 20 వేల విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ భద్రత కోసం 12 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తులకు సహాయం చేయడానికి షీ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచామన్నారు.