కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటు చోర్ అంటూ డ్రామాలు చేస్తున్నాడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దుయ్యబట్టారు. ఓటు చోర్ కాదు ఇటలీ నుండి వచ్చి గాంధీ పేరును చోర్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఓటు చోర్ జరిగి ఉందని కాంగ్రెస్ భావిస్తే తక్షణమే రాజీనామా చేసి గెలిసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు.