పీజీఆర్ఎస్ నిర్వహణపై పూర్తి స్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్క అర్జీదారునితో గ్రీవెన్స్ ని పరిష్కరించే అధికారి మాట్లాడాలన్నారు. అర్జీదారుని సమస్య పరిష్కారం కాకపోయినా, అర్జీదారుడు సమస్య పరిష్కారంలో సంతృప్తి చెందకపోయినా సమస్య కొత్తదిగానే రీ ఓపెన్ జరుగుతుందన్నారు.