కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోట మోర్ సూపర్ మార్కెట్ లో కరబైన కోడిగుడ్లు అమ్ముతున్నారని ఓ వినియోగిదారుడి ఫిర్యాదు మేరకు శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సూపర్ మార్కెట్ లో గుడ్లను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా, ఇంటికి వెళ్లి వంట చేసేందుకు గుడ్డు పగులగోట్టగా దుర్వాసనతో పాటు రెడ్ కలర్ లో ఉండడంతో సూపర్ మార్కెట్ కి వెళ్లి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సూపర్ మార్కెట్ లో నాసిరకం గుడ్లు ఉండడం పట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేసి శాంపిల్ కలెక్ట్ చేసి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.