నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ కు చెందిన ఓ వృద్ధురాలు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన కిష్టవ్వ కుటుంబ సభ్యులతో గొడవ పడినట్లు చెప్పారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై పోచారం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా ఏటకెళ్ళకు మృతదేహం లభించిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.