సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) బండ కింది పర్శరాములు ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఫిర్యాదారుడు తన కొలతలను ధ్రువీకరించి బిల్లులు ఆమోదం చేయడం కోసం అధికారిక సాయం చేయడానికి ఈసిని ఆశ్రయించగా బాధితుడు డబ్బులు ఇవ్వడానికి అంగీకరించడంతో వెంటనే ఏసీబీకి ఆశ్రయించగా రూ. 11,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే అవినీతి అధికారిని హైదరాబాదులోని నాంపల్లి ఎస్పీఈ, ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.