నారాయణ స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బాపట్ల పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొంది. రోడ్డుపై పడిన వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై బాపట్ల పట్టణ సిఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.