ములుగు జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం. పట్టించుకోని అధికారులు. ములుగు జిల్లా కేంద్రం నుండి హనుమకొండ వెళ్లే జాతీయ రహదారి 163 లో ఆనుకొని ఓ విద్యుత్ స్తంభం ఒక వైపు ఒరిగి ఉంది. జాతీయ రహదారిపై నిత్యం రోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఏదైనా అనుకోని సంఘటన జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఒరిగి ఉన్న స్తంభాన్ని సరిచేయాలని స్థానికులు నేడు ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు కోరుతున్నారు.