అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ప్రాంతంలో వేడి వేడి పాలు నోటిలో ముక్కులో పడి శర్విల్ రెడ్డి అనే 15 నెలల చిన్నారి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి కోట లోని పోస్టాఫీసు ఎదుట నివాసం ఉండే ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు శర్విల్ రెడ్డిపై బుధవారం వేడి పాలు నోటిలో, ముక్కులో పడ్డాయి. దీంతో చిన్నారి శర్విల్ రెడ్డిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.