కొత్తపేట పంచాయతీ పరిధిలోని వడ్డె సంఘంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించగా ఒక పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది.అదృష్టవశాత్తూ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడ నివసించే ఒక మహిళ ఉదయాన్నే వంట ముగించుకుని పొయ్యిని ఆర్పకుండానే పనులకు వెళ్లిపోవడంతో అందులో నుండి మంటలు చెలరేగి పక్కింటికి వ్యాపించాయని స్థానికులు చెప్పారు.చీరాల అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు.