జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని నిర్ణీత వ్యవధిలోగా అనుమతులు మంజూరు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కన్వీనర్ గా జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ తుల్జా నాయక్ వ్యవహరించగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాయిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం 28 లక్షల సబ్సిడీ బిపిసి ఆమోదం తెలిపిందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమల స్థాపనకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.