రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరి కొత్తపల్లి మండల రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని మంగళవారం ఉదయం 10 గంటలకు తెలిపారు.ఈ క్రమంలో మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీర్న దృశ్యాలు కనబడుతున్నాయి, తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు రైతులు.మండల వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం యూరియా అందించడంలో విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు.