యూరియా కష్టాలు రోజురోజుకు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు ఆగ్రో సేవా కేంద్రంలో యూరియా నిల్వలు లేకపోవడంతో తమకు యూరియా సరఫరా చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడికి చేరుకొని యూరియా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపినా కూడా రైతులు మాత్రం తమకు తక్షణమే యూరియాను సరఫరా చేయాలంటూ ఎమ్మెల్యే తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఓ దశలో పరిస్థితి ఆందోళనకు దారితీసింది. ఇదిలా ఉండగా జడ్చర్ల రైల్వే స్టేషన్ కు యూరియ