ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సూర్యలంక బీచ్ ను ఆంధ్ర గోవాగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా, చిత్ర దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళికి సమర్పించారు. బీచ్ లో సినిమా షూటింగ్లు నిరంతరాయంగా జరిగేలా పర్యాటకశాఖ ద్వారా అవసరమైన సెట్లను నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలు సినీ పరిశ్రమకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉండనారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ అవకాశం కల్పించాలని కలెక్టర్ వెంకట మురళిని కోరారు.