నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి భూమికోసం భుక్తి కోసం పోరాడిన దీరవనిత సాకలి ఐలమ్మ అని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఆమె స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కెవిపిఎస్ కలుగీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.