పోరుబాటను జయప్రదం చేయండి; దొరబాబు. రైతాంగ సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 9న నిర్వహించే పోరు బాటను జయప్రదం చేయాలని పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దొరబాబు కోరారు. సామర్లకోట పార్టీ కార్యాలయంలో పోరుబాట గోడపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. రైతులకు కనీసం ఎరువులు కూడా లభించని దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు వస్తున్న ఎరువులన్నీ తెలుగుదేశం నేతల గూటికి చేరుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.