విశాఖలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం పలుచోట్ల ఉరుములతో వర్షం దంచికొడుతోంది. డాక్ యార్డ్ సమీపంలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కర్మాగారం ఆవరణలో ఆయిల్ ట్యాంకర్(ఇందనాల్)పై పిడుగు పడి మంటలు చెలరేగాయి. వర్షం పడటంతో మంటలు వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వంటలు అదుపు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు