అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో కుప్పకూలి షాకీర్ అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో జంగాల కాలనీ సమీపంలో నివాసం ఉండే షాకిర్ వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే వాడు. ఈ క్రమంలో తాడిపత్రి రోడ్డులో ఉన్న తన వెల్డింగ్ దుకాణం వద్దకు వెళ్ళాడు. అయితే రాత్రి అవుతున్నా షాకీర్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు వెల్డింగ్ దుకాణం వద్దకు వెళ్లి చూసారు. అయితే షాకీర్ దుకాణం బయట కుప్పకూలి పడి ఉన్నాడు.