నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమ్మ వెంచర్ న్యూ బ్రిడ్జి వద్ద వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మంగళవారం నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వాగులో మృతదేహం ఉండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయస్సు 28-38 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుడి కుడిచేతిపై మీనాక్షి అని పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే నాలుగవ టౌను సంప్రదించాలన్నారు.