చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద బస్సును ఓవర్ టెక్ చేయబోయి ద్విచక్ర వాహనం మదనపల్లె వైపు నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు త్రీవంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 సిబ్బంది పైలెట్ రబ్బాని ఈఎంటి జాషువా, హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.