ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆటోడ్రైవర్లు ఉపాధిని కోల్పోతున్నారని సోమవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి స్వాగతిస్తున్నామని అయితే ఆటో కార్మికులు జీవనోపాధిని కోల్పోతున్నారని వారికి ఏడాదికి వాహన మిత్ర పథకం కింద 24 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.