బరాబర్ హిందువుల ఓట్లతోనే గెలిచానని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మంగళవారం అన్నారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏ ఎన్నికల్లో నేనా పోటీ చేసి గెలిస్తే కదా ఓట్లకు, దొంగ ఓట్లకు తేడా తెలిసేదని అన్నారు. అసలు మైనార్టీ ఇండ్లలోనే అత్యధిక దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ ఓట్లు పడినా కూడా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. అసెంబ్లీని రద్దుచేసి, దొంగ ఓట్లను తీసేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ గెలవదని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.