*కాకినాడ జిల్లా సామర్లకోటలో కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం గోదావరి ఘాటు వద్ద,కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఉత్తర్వులు మేరకు గురువారం నాడు వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది. సామర్లకోట సి ఐ, శ్రీ ఏ. కృష్ణ భగవాన్ మరియు ఇతర అధికారుల ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, చక్కని ప్రణాళికతో, పకడ్బందీ ఏర్పాట్లు చేసి, వినాయక నిమజ్జనం విజయవంతంగా నిర్వహించారు. స్థానిక డి ఎస్ పి శ్రీహరి రాజు మరియు ఇతర అధికారులతో గణేష్ యువత ఆనందం పంచుకోవడం జరిగింది.