ఫోటోగ్రఫీ అనేది ఒక విలువైన సామాజిక సాధనం సమాజాన్ని కదిలించే శక్తిని కలిగి ఉందని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఫోటో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ సంఘటనను చరిత్రలో నిలబెట్టే మహత్తరమైన పాత్ర పోషిస్తుందని, కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ మిళితంగా ఒక ఫోటో జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే శక్తిని కలిగి ఉందని అన్నారు. అంతకుముందు జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీరు సందర్శించి, అక్కడ ప్రదర్శించిన చిత్రాలను అభినందించారు.