పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకా యలంకలో గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంకవాసుల యోగక్షేమలను తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం యలమంచిలి మండలం కనకా యలంకకు పడవపై చేరుకున్నారు. గ్రామంలోని రోడ్లపైకి నీరు రావడం పరిశీలించారు. మార్గం మధ్యలో అంగన్వాడి ఫ్రీ స్కూల్ లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.