నా రాజకీయ జీవితంలో ప్రతి అడుగుకు బలం ఇచ్చింది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల మల్లిఖార్జునరావు(బాబ్జీ) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం సాయంత్రం ఏడు గంటలకు ఆయన మాట్లాడుతూ.. మీరు చేసిన కష్టాలు, పడిన త్యాగాలు, పార్టీ పట్ల చూపించిన అచంచలమైన విశ్వాసమే నన్ను ఈ స్థానం వరకు తీసుకువచ్చాయి. ఇప్పుడు మన కార్మిక కులానికి ఆశ్రయం, అండగా నిలబెట్టే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌గా 2025 ఆగస్టు 28 గురువారం నేను బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.